ఉచిత రేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం

65
- Advertisement -

కరోనా మరోసారి విజృంభణతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం అయిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు గుడ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే యేడాది వరకు దేశ ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం శుక్రవారం నిర్ణయించింది.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని 81.3కోట్ల మందికి ఏడాది పాటు ఉచిత రేషన్‌ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉచిత రేషన్ అందించడానికి కేంద్రంకు దాదాపుగా రూ.2లక్షల కోట్ల ఖర్చువుతుందని ఈ ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

ఒక్క రూపాయి సైతం చెల్లించకుండా డిసెంబర్ 2023 వరకు ఉచితంగా 81.3 కోట్ల మందికి రేషన్ అందిస్తామని చెప్పారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, ప్రభుత్వం ప్రస్తుతం ఒక వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను కిలోకు రూ. 2 నుంచి 3 రూపాయల చొప్పున అందిస్తోంది. అయితే అంత్యోదయ అన్న యోజన కింద ఉన్న కుటుంబాలకు ప్రతినెలా 35 కిలోల ఆహార ధాన్యాలు అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

అగ్రరాజ్యంలో మంచుతుపాను బీభత్సం..

అల్లం టీ తో ప్రయోజనాలు..

దానిమ్మతో ఆరోగ్యం…

 

- Advertisement -