అరెరే.. ఆ పాన్ ఇండియా క్రేజ్ ఏమైంది ?

376
- Advertisement -

సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, ఆయన రాసే పాత్రల బలం గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. కానీ ఇటీవలి కాలంలో సుకుమార్ అనుసరిస్తున్న శైలి పట్ల నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుష్ప విషయంలోనే సుకుమార్ పై బాగా నెగిటివ్ ప్రచారం జరిగింది. దీనికితోడు నిన్న రిలీజ్ అయిన 18 పేజెస్ విషయంలోనూ సుకుమార్ పై బాగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు 18 పేజెస్ బయ్యర్లు. బ్రాండ్ అంటూ సుకుమార్ పేరు చెప్పి.. అదనపు రేట్లకు సినిమాని అంటగట్టారు అని టాక్ ఉంది.

ఇప్పుడేమో 18 పేజెస్ కి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. తప్పెవరిది ?, అసలు ఈ సినిమా మార్కెట్ వెనుక ఏం జరిగిందనేది లోగుట్టు పెరుమాళ్ళకెరుక. సుకుమార్ ఈ సినిమా కథ రాసేందుకే చాలా సమయం తీసుకున్నాడు. తన టీమ్ తో చాలా కసరత్తులు చేశాడు. దాంతో సుకుమార్ ఫ్యాన్స్ మరియు నిర్మాతలు, బయ్యర్లు కూడా సుకుమార్ నుంచి ఎక్కువ ఆశించడం మొదలుపెట్టారు.

తీరా చూస్తే సుకుమార్ రాసిన కథ మరీ నత్తనడకనే సాగింది. అయినా ముందు నుంచీ ఈ 18 పేజెస్ సినిమా విషయంలో చాలా ఆలస్యం జరుగుతూనే ఉంది. ఏది ఏమైనా థియేటర్స్ దగ్గర ఈ సినిమా తాలూకు హడావిడి ఎక్కువగా కనిపించలేదు. అదేంటో నిఖిల్ ‘కార్తికేయ 2’ లాంటి పాన్ ఇండియా హిట్ కొట్టాక, నిఖిల్ నుంచి రిలీజ్ అయిన మొదటి సినిమా ఇది. అయినా ఆ క్రేజ్ ఈ సినిమా పై లేదు. మరి దీనికి కారణం ఏమిటి అంటే ?, సమాధానం ఏదీ !

ఇవి కూడా చదవండి..

- Advertisement -