షాకింగ్‌… సినిమాలకు అనుపమ గుడ్‌ బై

234
- Advertisement -

అనుపమ పరమేశ్వరన్‌.. కేరళ బ్యూటీ అయిన అనుపమ.. చూడ్డానికి అచ్చం తెలుగమ్మాయిలా.. తెలుగుదనం ఉట్టిపడేలా నిండైన చీరకట్టుతో తెలుగింటి ఆడపడుచులా ఉంటుందనే చెప్పొచ్చు. తన అంద చందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెలు పిండేస్తూ.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందం, తనదైన నటనా, చలాకితనంతో అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న అనుపమకు ఇప్పటి వరకు సరైన హిట్‌ లేదనే చెప్పాలి.

ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్‌, ఇటు మాలీవుడ్‌ చిత్ర పరిశ్రమల్లో అవకాశాలు వస్తోన్న ఈ అమ్మడికి ఎక్కడాకూడా చెప్పుకోదగ్గా హిట్‌ లేదు.. ఇటీవల తెలుగులో హీరో నిఖిల్‌ తో చేసిన సినిమా కార్తీకేయ 2 సినిమా హిట్‌ అవడంతో అనుపమకు చెప్పుకోదగ్గ సినిమా ఒకటి దక్కిందని చెప్పాలి. అయితే ఈ అమ్మడు తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలోనూ.. ఆమె అభిమానుల్లోనూ తీవ్ర కలవరం రేపుతోంది.

అనుపమ నటించిన 18 పేజీస్‌ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫంక్షన్‌ లో అనసూయ తాను ఇక నటనకు గుడ్‌ బై చెబుతానని.. తనకు దర్శకత్వం అంటే ఇష్టమని.. త్వరలో ఓ సినిమా డైరెక్ట్‌ చేస్తానని షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఇప్పుడు ఇవే కామెంట్స్‌ హాట్‌ టాఫిక్‌గా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై పలువురు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అనుపమకు సరైన హిట్స్‌ లేకపోవడంతోనే ఆమె సినిమాలకు విరామం చెబుతోందని పలువురు అంటుండగా… నచ్చిన పనిని చేయడంలో తప్పులేదంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఏదిఏమైనా అనుపమ సినిమాలకు విరామం ఇవ్వబోతోందన్న వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఒకింత కలవరానికి గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి..

సూపర్ ఛాన్స్..కానీ కుదరదు అనేసింది

బాలయ్య కోసం శ్రీలీల లుక్ టెస్ట్

ఎన్టీఆర్ – కొరటాల..ఫుల్ మాస్

- Advertisement -