KCR:బీఆర్ఎస్ గెలిస్తేనే గోదావరి జలాలు

11
- Advertisement -

గోదావరి జలాలు కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి తీరాలన్నారు మాజీ సీఎం కేసీఆర్. సిరిసిల్ల పాతబస్టాండ్ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన కేసీఆర్..మన నేత కార్మికుల బతుకులు బాగుండాలన్నా.. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రేపు జిల్లా తీసేస్తా అంటే.. అడ్డం పడి కొట్లాడేటోడు.. యుద్ధం చేసేటోడు కావాలని తెలిపారు.

సిరిసిల్లకు ఒక టెక్స్‌టైల్‌ పార్క్‌ కావాలంటే నరేంద్ర మోడీ ఇవ్వలేదు.. అయినా సరే రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలు, రంజాన్‌ గిఫ్ట్‌లు, స్కూల్‌ యూనిఫాం కాంట్రాక్టులు ఇచ్చి కాపాడుకున్నాం అన్నారు. కనీసం నెలకు 15వేలు, 20వేలు జీతం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాం… కానీ ఈనాడు వచ్చిన ఈ సర్కార్‌ అన్నింటిని బంద్‌ పెడతుందని మండిపడ్డారు.

గుడ్డిగా ఓట్లు వేయడం కాదు.. ఎవరో చెబితే ఓట్లు వేయడం కాదు.. మన బతుకేంది.. మన ఆగమేందనేది ఆలోచన చేయాలని సూచించారు. ఆనాడు తెలంగాణను కాంగ్రెస్‌ అవమానిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేశానని.. అప్పుడు మీరే 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచారని గుర్తు చేశారు కేసీఆర్. సిరిసిల్ల జిల్లా ఉండాలంటే ఇక్కడ వినోద్‌కుమార్‌ గెలవాలని స్పష్టం చేశారు.

- Advertisement -