మాజీ సీఎం చంద్రబాబుకు తప్పిన ప్రమాదం…

135
chandrababu

టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది.ఆవును తప్పించబోయి కాన్వాయ్ లోని ముందు వాహనం సడెన్ బ్రేక్ వేయగా….ఒక్కసారిగా కాన్వాయ్ లోని ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టింది బుల్లెట్ ప్రూఫ్ వాహనం.తర్వాతి వాహనంలో ఉన్న చంద్రబాబు క్షేమంగా ఉన్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ముందుభాగం దెబ్బతినగా స్వల్ప గాయాలతో మరో వాహనంలో వెళ్లారు భద్రతా సిబ్బంది.అమరావతి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.