దుర్గం చెరువును సందర్శించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్…

301
- Advertisement -

హైదరాబాద్ నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రం దుర్గం చెరువు ను పర్యాటక ఉన్నతాధికారులతో కలసి సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు దుర్గం చెరువు ను పర్యాటకంగా అభివృద్ధి చేయుటకు పర్యాటక శాఖ అధికారులతో కలసి సందర్శించడం జరిగిందన్నారు.

పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కె టి రామారావు గారు సూచనల మేరకు హైదరాబాద్ నగరానికి తలమానికంగా HMDA ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో పూర్తి అయిన అనంతరం ప్రారంభించిన తరువాత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దుర్గం చెరువులో అత్యాధునిక రెస్టారెంట్, బోటింగ్ సదుపాయాలను, పర్యాటకులు కుటుంబం తో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం లో రోజంతా ఉండేలా కార్యక్రమాలను రూపొందించేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం అయిన తరువాత పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమైన కార్యక్రమాలను టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నామన్నారు మంత్రి శ్రీ V శ్రీనివాస్ గౌడ్.

కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని పర్యాటకులకు సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం కోవిడ్ వల్ల పర్యాటకులు ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేనందు వల్ల మన రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను పర్యాటకులు సందర్శించాలని మంత్రి పిలుపునిచ్చారు.మన రాష్ట్రంలో ఇతర దేశాల కంటే ఎక్కువ టూరిజం ప్రాంతాలు, చరిత్ర గల ప్రదేశాలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో, కృష్ణ, గోదావరి నదుల పరివాహక ప్రాంతాలతో పాటు టెంపుల్ టూరిజం ప్రాంతాలైన యాదాద్రి, వేములవాడ మరియు మహబూబ్ నగర్ జిల్లా లోని మన్యం కొండ మరియు KCR ఎకో టూరిజం పార్క్, రాష్ట్రంలో ఉన్న ప్రకృతి సహజంగా ఏర్పడిన సుందర ప్రదేశాలు ఉన్నాయన్నారు. ఇటీవల సినిమా పరిశ్రమ కు చెందిన దర్శకులు, నిర్మాత లు, బుల్లితెర సీరియల్ నిర్మాణ సంస్థల ప్రతినిధులకు రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్రాంతాల గురించి వివరించామన్నారు. మన తెలంగాణ రాష్ట్రం లో సినిమా, సీరియల్ ల షూటింగ్ లు జరుపుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు టూరిజం శాఖ నుండి అందిస్తామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్.ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యటకాభివృద్ధి సంస్థ MD మనోహర్, టూరిజం శాఖ అధికారులు అశోక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -