బిగ్ బాస్: అభిమానులకు షాకిచ్చిన గంగవ్వ

421
Gangavva
- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్‌ఫుల్‌గా తొలివారం పూర్తి చేసుకుంది. అంతేకాదు రెండోవారం నామినేషన్ ప్రక్రియను కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇక మొదటి వారం తర్వాత ఇంటి నుంచి దర్శకుడు సూర్య కిరణ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో కమెడికన్ కుమార్ సాయి‌ హౌస్‌లో అడుగుపెట్టాడు. దాదాపు 15 వారాలు పాటు జరిగే ఈ షోలో టైటిల్ కోసం 17 మంది (వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలిపి) పోటీ పడుతున్నారు. కొత్త ప్రోమో రిలీజ్ చేసింది స్టార్‌ మా.

ఈ రోజు ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో..రెండోవారం నామినేషన్ ప్రక్రియను చూపించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటి లోపలికి ఓ పడవను తీసుకొచ్చారు. సభ్యులంతా అందులో ఎక్కాల్సి ఉంటుంది. ఒకసారి ఎక్కిన తర్వాత మళ్లీ దిగకూడదు. పడవ తీరానికి చేరుకున్నాక హారన్ మోగిన తర్వాత.. ఖచ్చితంగా ఒక్క సభ్యుడు పడవ నుంచి కిందకు దిగాల్సి ఉంటుంది. అందుకోసం మిగతా హౌస్‌మేట్స్ ఒకరిని కన్విన్స్ చేయాలి.

అలా పడవ దిగిన వ్యక్తి.. ఈ వీక్ నామినేషన్స్‌లో ఉంటాడు. ఐతే పడవ దిగేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. గంగవ్వ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రోమోలో కనిపిస్తోంది. ఫస్ట్ నేనే దిపోతా.. అంటూ దిగిపోయే ప్రయత్నం చేస్తుంది. అంతలోనే మిగతా సభ్యులు జోక్యం చేసుకొని వద్దు అని చెబుతారు. మరి గంగవ్వ పడవ నుంచి దిగిపోయి సెల్ఫ్ నామినేట్ చేసుకుంటుందా? లేదా అనేది ఇవాళ్టి ఎపిసోడ్‌ చూస్తే అర్ధమౌతుంది.

- Advertisement -