రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ సింగ్..

151
Harivansh Narayan Singh

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా వరుసగా రెండోసారి హరివంశ్ ఎన్నికయ్యారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజే రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరిగింది. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం హరివంశ్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పెద్దల సభలో ప్రతిపాదన చేయగా, కేంద్రమంత్రి తవర్చంద్ గెహ్లాట్ బలపరిచారు. అటు, విపక్ష అభ్యర్థిగా మనోజ్ కుమార్ ఝా పేరును కాంగ్రెస్ సభ్యుడు గులాంనబీ అజాద్ ప్రతిపాదించగా, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ బలపరిచారు.

ఈ ఓటింగ్ మూజువాణి పద్ధతిలో నిర్వహించారు. ఇందులో హరివంశ్ సింగ్ విజయం సాధించినట్టు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. హరివంశ్ తొలిసారిగా 2018 ఆగస్టు 8న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్ తో ముగిసింది. అనంతరం మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.