చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘డాకు మహారాజ్’

16
- Advertisement -

వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అనంతపురములో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించిన చిత్ర బృందం, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వేడుకలో బాలకృష్ణ స్వయంగా ”గణ గణ గణ ఆంధ్ర తెలంగాణ” పాటను పాడి అభిమానుల్లో ఉత్సాహం నింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విజయోత్సవ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ. అభివక్త ఆంధ్రప్రదేశ్ కి ఆరుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది రాయలసీమ. తెలుగుజాతి కోసం పిడికిలి బిగించిన ఒక మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఇది రాయలసీమ కాదు రాయల్ సీమ. డాకు మహారాజ్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సినిమాకి ఏదో కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఎంతో రీసెర్చ్ చేస్తుంటాము. డాకు మహారాజ్ కోసం కూడా ఎంతో రీసెర్చ్ చేశాము. ఆదిత్య 369 లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి గుర్తుండిపోయే పాత్రలు చేయాలనే ఆలోచన నుంచి డాకు మహారాజ్ పాత్ర పుట్టింది. కోవిడ్ సమయంలో సాహసించి అఖండ సినిమాను విడుదల చేశాము. ఆ సినిమా అఖండ విజయం సాధించింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఈ సినిమాలు అభిమానులకు నచ్చడమే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషంగా ఉండేలా చేశాయి. నా తండ్రి, గురువు, దైవం నందమూరి తారక రామారావు గారు నాకు అభిమానుల రూపంలో ఇంతటి కుటుంబాన్ని ఇచ్చారు. ఆయన బిడ్డగా పుట్టడం నా జన్మజన్మల పుణ్యఫలం. నేను సినిమా కలెక్షన్స్ గురించి పట్టించుకోను. నా అభిమానులే నా ప్రచార కర్తలు. వాళ్లకు తెలుసు.. నా రికార్డులన్నీ ఒరిజినల్ అని, నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని, నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని. దర్శకుడు బాబీ ఎంతో ప్రతిభావంతుడు. నటీనటుల నుంచి హావభావాలు చక్కగా రాబట్టుకోగలిగాడు. థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీతం హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే. ఎంతో బాధ్యతగా అద్భుతమైన సంగీతం అందించాడు. మా కెమెరామ్యాన్ విజయ్ కార్తీక్ గారి విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. యుగంధర్ గారి వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉంది. రచయితలు మోహన్ కృష్ణ గారు, చక్రి, నందు, భాను కలిసి సన్నివేశాలు, సంభాషణలు గొప్పగా రాశారు. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ దబిడి దబిడి సాంగ్ అదరగొట్టారు. అఖండ నుంచి నాది, ప్రగ్యా జైస్వాల్ ప్రయాణం మొదలైంది. అందం, నటన కలబోసుకున్న నటి ప్రగ్యా. ఇక శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ లో ఫైర్ బ్రాండ్. గీత రచయితలు అనంత్ శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు అరుదుగా ఉంటాయి. అలాంటి సినిమా డాకు మహారాజ్. మంచి సినిమాని ఆదరించి, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు మరోసారి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.” అన్నారు.

దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, “అనంతపురం ప్రజలు నాకు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు. రాయలసీమ బాలకృష్ణ గారి అడ్డా. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు ఇలాంటి సినిమాలు గుంటూరులో ఒక జాతర లాగా చూసిన కుర్రాణ్ణి నేను. ఒక దర్శకుడిగా సక్సెస్ మీట్ కి రావడం సంతోషంగా ఉంది. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. అయినప్పటికీ నేను సినిమాల్లోకి వెళ్తానంటే నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు ముందుగా కృతఙ్ఞతలు. నేను చిరంజీవి గారి అభిమానిని అని చెప్పినా కూడా బాలకృష్ణ గారు నన్ను దర్శకుడిగా ఎంతో ప్రోత్సహించారు. ఆయనకు నిజాయితీగా ఉంటే ఇష్టం. అబద్ధాలకు బాలకృష్ణ గారి దగ్గర చోటు లేదు. మా నాన్న గారు మరణించక ముందు నేను బాలకృష్ణ గారిని కలిసి ఉంటే మా నాన్న నాకు ఇంకా బాగా అర్ధమయ్యేవారు అనిపిస్తుంది. మా నాన్నగారు కూడా ఇలాగే ప్యూర్ హార్ట్ తో ఉంటారు. ప్రేమైనా కోపమైనా అప్పుడే చూపిస్తారు. ఒకప్పుడు నాకు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి లాంటి గొప్ప వ్యక్తి కొడుకుగా తెలుసు, కోట్ల మంది అభిమానులకు దేవుడని తెలుసు, మాట ఇస్తే నిలబడతారని తెలుసు. కానీ దగ్గర నుంచి చూసాక బాలకృష్ణ గారిది ఎంత గొప్ప మనసో తెలిసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాలకృష్ణ గారి అభిమానులు ఫోన్లు, మెసేజ్ లు చేసి మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారు. నా డైరెక్షన్ టీంకి, రైటింగ్ టీంకి పేరుపేరునా కృతఙ్ఞతలు. విజయ్ కార్తీక్ గారు విజువల్స్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. థమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. అవినాష్ కొల్లా గారి లాంటి గొప్ప ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గారు కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడారని విన్నాను. కావేరి, నందిని పాత్రలకు ప్రాణం పోసిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కి థాంక్స్. వేద అగర్వాల్ కి మంచి భవిష్యత్ ఉంది. నేను అభిమానిని కాదు, ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గారికి ఫాలోవర్ ని అయిపోయాను. హీరోని అభిమానించే, దర్శకుడిని నమ్మే.. నిర్మాత నాగవంశీ గారి వల్లే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్ లో బాలకృష్ణ గారితో డాకు మహారాజ్ ని మించిన గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నాను.” అన్నారు.

సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ, “బాలకృష్ణ గారి సినిమాకి సంగీతం చేయడం అనేది నాకు టెన్త్ ఎగ్జామ్ లా ఉంటుంది. ప్రతి సినిమాకి ఇంకా గొప్ప సంగీతం అందించాలనే కసితో పనిచేస్తున్నాను. బాలకృష్ణ గారిని చూస్తేనే ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఉత్సాహంతోనే సంగీతం చేస్తున్నాను. బాలకృష్ణ గారు నాకు తండ్రి లాంటి వారు. నన్నెప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. దర్శకుడు బాబీ గారికి సంగీతం మీద మంచి పట్టు ఉంది. ఆయన విజిల్ చేస్తూ పాటను హమ్ చేశారంటే అది హిట్టే. భైరవద్వీపం మా కుటుంబాన్ని ఆదుకున్న సినిమా. డ్రమ్స్ వాయిస్తూ రోజుకి 30 రూపాయలు తీసుకుంటూ బాలకృష్ణ గారి సినిమాతోనే నా సినీ ప్రయాణం మొదలైంది. అలాంటి నేను ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలకు సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు బాబీ ఎంతో కష్టపడ్డారు. ప్రతి సన్నివేశాన్ని ఇంకా గొప్పగా చేయడానికి ప్రయత్నించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి, త్రివిక్రమ్ గారికి, సాయి సౌజన్య గారికి నా స్పెషల్ థాంక్స్. డీఓపీ విజయ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ గా నిలిచారు. డీఓపీ విజయ్, ఎడిటర్లు నిరంజన్, రూబెన్ వల్లే ఇంత మంచి సంగీతం అందించడం సాధ్యమైంది. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీ గారికి ధన్యవాదాలు.” అన్నారు.

Also Read:వైసీపీ నేత కాకాణిపై కేసు నమోదు

- Advertisement -