41 కోట్ల టీకాలు…45 కోట్ల కరోనా టెస్టులు

196
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదుకాగా 507 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,12,57,720కు చేరగా 4,18,987 మంది మృతిచెందారు. కరోనా నుండి ఇప్పటివరకు 3,04,29,339 మంది బాధితులు కోలుకోగా 4,09,394 యాక్టివ్‌ కేసులున్నాయి.

టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 41,78,51,151 డోసులు పంపిణీ చేయగా 45.09 కోట్ల కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో క్రియాశీల కేసులు 1.31శాతం ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 2.12శాతంగా ఉంది.