కౌశిక్ రెడ్డికి జీహెచ్‌ఎంసీ భారీ ఫైన్..

131
koushik

టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డికి భారీ ఫైన్ వేసింది జీహెచ్‌ఎంసీ.అనుమతి లేకుండా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు కౌశిక్‌ రెడ్డి. ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఆయనకు రూ. 2,50,000 ఫైన్ విధించింది. నగర వాసుల నుండి అనేక ఫిర్యాదులు రావడంతో కౌశిక్ రెడ్డికి ఫైన్‌ విధించినట్టు వెల్లడించింది. హుజురాబాద్‌ అసెంబ్లీ నియోకవర్గానికి చెందిన పాడి కౌశిక్‌ రెడ్డి….సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.