కరోనా కొత్త వేరియంట్‌..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

26
- Advertisement -

కరోనా కొత్త వేరియంట్ అందరిని భయాందోళనకు గురి చేస్తోంది. జేఎన్‌-1 కొత్త వేరియంట్‌ రూపంలో మళ్లీ విజృంభిస్తోండగా అమెరికాలో మొదలైన ఈ వేరియంట్‌ దేశంలోనూ వ్యాపిస్తోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో కేసులు నమోదుకాగా తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసుల సంఖ్య పెరిగిపోతోంది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అధికారులు చర్యలు చేపట్టగా ప్రజలు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.

()జ్వరం, జలుబు, గొంతు సమస్యలు పెరుగుతున్న ఈ తరుణంలో కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతుందని ఆందోళన ఉందని అందుకే రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లను ధరించాలన్నారు.

() 10 ఏండ్లలోపు పిల్లలు, 60 ఏండ్లు దాటిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.

()చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు.

()జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.

()ప్రతిరోజు గోరువెచ్చటి నీటిని తాగాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు.

Also Read:రిపబ్లిక్ డే వేడుకలకు గెస్ట్‌గా ఆదేశ అధ్యక్షుడు?

- Advertisement -