ఏపీలో కొత్తగా 158 మందికి కరోనా..

41
corona

ఏపీలో గత 24 గంటల వ్యవధిలో 43,770 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 158 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 8,86,852 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,78,232 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,473కి పడిపోయింది. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,147కి చేరింది.

కొత్తగా నమోదైన పాజిటీవ్‌ కేసులలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 23, విశాఖ జిల్లాలో 18 కేసులు గుర్తించారు. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కేసులు వచ్చాయి. అదే సమయంలో 172 మంది కొవిడ్ ప్రభావం నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. ఆ మరణం విశాఖ జిల్లాలో నమోదైంది.