ఏపీ కరోనా అప్‌డేట్‌..

50

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 478 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 119 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 96, గుంటూరు జిల్లాలో 60 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 4 కేసులు గుర్తించారు. అదే సమయంలో 574 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 14,333కి పెరిగింది.రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,781 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,43,050 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,398 మంది చికిత్స పొందుతున్నారు.