చంద్రకాంత్ సాగర్‌కు మంత్రి కేటీఆర్‌ భరోసా..

45
ktr minister

ఆశయం ఉన్నతమైనప్పుడు ఆటంకాలను అవలీలగా దాటవచ్చు .. ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని నిరూపించాడు దివ్యాంగుడైన చంద్రకాంత్ సాగర్. తాను దివ్యాంగుడైనా.. చక్రాల కుర్చీకే పరిమితం అని తెలిసినా.. ప్లాస్టిక్ రహిత సమాజానికి కట్టుబడతానని కంకణబద్ధుడయ్యాడు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా రీసైక్లింగ్ సరుకుతో నాన్ వోవెన్ సంచులను తయారుచేసే సంస్థను ఏర్పాటు చేసి తనతో పాటు మరికొంత మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచాడు.

చంద్రకాంత్ సాగర్ ప్రతిభను గుర్తించిన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ‘Outstanding Self-Sustaining Effort by a Differently -Abled Person’ Award కు ఎంపిక చేయగా, ఈరోజు జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, చంద్రకాంత్ సాగర్‌ను ఆప్యాయంగా పలకరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.అనంతరం చంద్రకాంత్‌ సాగర్‌తో మంత్రి సెల్ఫీ తీసుకున్నారు.