జియోఫైబర్ సరికొత్త ప్లాన్స్..

281
- Advertisement -

టెలికాం రంగంలో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో పోటీపడుతున్నాయి. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు, మార్కెట్ ను పెంచుకునేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా జియోఫైబర్ గుడ్ న్యూస్ చెప్పింది. జియో సరికొత్త ప్లాన్స్ ప్రకటించింది. ‘నయే ఇండియా కా నయా జోష్’ పేరుతో కొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమౌతాయి. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అంతేకాదు… 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఆఫర్ చేస్తోంది. 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం.

అంతేకాదు కొత్త యూజర్లకు 10 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 30 రోజుల ఫ్రీ ట్రయల్‌లో భాగంగా 10 ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కాలింగ్ ఉచితం. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు. ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కొత్త కస్టమర్లకు మాత్రమే. సెప్టెంబర్ 1 నుంచి జియోఫైబర్ యాక్టివేట్ చేసుకునే కస్టమర్లకు 30 రోజుల ఉచిత ట్రయల్ వర్తిస్తుంది. కొత్తగా జియో ఫైబర్ 4 ప్లాన్స్ ప్రకటించింది.

JioFiber Rs 399 Plan: జియోఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.Rs 699 Plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.

Rs 999 Plan: జియోఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1000 విలువైన 11 ఓటీటీ యాప్స్ సబ్‍స్క్రిప్షన్స్ ఉచితం. Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1500 విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్‍స్క్రిప్షన్స్ ఉచితంగా పొందవచ్చు.

కొత్త కస్టమర్లకు మాత్రమే కాదు… ఇప్పటికే జియోఫైబర్ కస్టమర్లుగా ఉన్నవారికి కూడా లాయల్టీ బెనిఫిట్స్ ప్రకటించింది కంపెనీ. కొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకారం బెనిఫిట్స్ పొందేందుకు ప్రస్తుత జియోఫైబర్ కస్టమర్లు అప్‌గ్రేడ్ కావొచ్చు.. ఆగస్ట్ 15 నుంచి 31 మధ్య జియోఫైబర్ తీసుకున్న వారికి 30 రోజుల ఫ్రీ ట్రయల్ బెనిఫిట్ వోచర్ మైజియోలో లభిస్తుంది.

- Advertisement -