జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్‌..

55
- Advertisement -

రిలయన్స్ జియో తమ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. ఇటీవలి కాలంలో ఆఫర్లను, కొత్త ప్లాన్‌లను వరుసగా తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో మరో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్లను అందించడానికి జియో ఎప్పటికప్పుడు తన ప్లాన్లను అప్ డేట్ చేస్తూ ఉంటోంది. అయితే ఇప్పుడు అన్ని టెలికాం కంపెనీలు 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి.

మిగతా టెలికాం కంపెనీలతో పోల్చితే అత్యంత తక్కువ రూ. 395కే 84 రోజుల పాటు వ్యాలిడిటీ అందించే ప్లాన్ ను అందిస్తోంది జియో. ఈ ప్లాన్ తో 6GB డేటా లభిస్తుంది. 1000 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. డేటా తక్కువగా వాడే వారికి ఇది బెస్ట్ ప్లాన్ గా చెప్పొచ్చు.

- Advertisement -