తమిళ నటి జ్యోతిక, భాగ్యరాజ్, పార్థీబన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం బంగారు తల్లి. పిల్లల వరుస కిడ్నాప్ ఉదంతాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. 2004వ సంవత్సరం ఊటీలో ఐదుగురు పిల్లలను కిడ్నాప్ చేసిన ఉదంతంలో.. కిడ్నాప్ చేసి హత్య చేయబడిన జ్యోతి అనే చిన్నారి కేసు దర్యాప్తు నేపథ్యంలో సినిమా కొనసాగనుంది. లాయర్ చెప్పే సంభాషణలతో మొదలయ్యే ట్రైలర్ సస్పెన్స్ గా సాగుతోంది. జేజే ఫ్రెడ్రిక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి గోవింద్ వసంత మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్య నిర్మిస్తుండటం విశేషం.
Bangaru Thalli Trailer | Jyotika | Suriya | JJ Fredrick | Govind Vasantha | Premieres Sept 11