గూఢ‌చారిగా మారనున్న హీరో అఖిల్..

136
akhil

టాలీవుడ్ యంగ్‌ హీరో అక్కినేని అఖిల్, సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో ఓ సినిమా రానున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టును అనిల్ సుంక‌ర నిర్మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. బుధవారం ఉద‌యం 9.09 గంట‌ల‌కు దీనికి సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.

సెప్టెంబ‌ర్ 9న ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల 9 సెకన్ల‌కు అఖిల్ సినిమా ప్ర‌క‌ట‌న‌కు ముహూర్తం ఖ‌రారైంది. ది బోర్న్ ఐడెంటిటీ ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో అఖిల్ గూఢ‌చారి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌. యాక్ష‌న్ డ్రామాగా రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించ‌నున్నారు.