‘భ‌గ‌వంత్ కేస‌రి’ ఎందుకు హిట్ అయింది?

27
- Advertisement -

నంద‌మూరి బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘భ‌గ‌వంత్ కేస‌రి’ మూవీ ఎందుకు హిట్ అయ్యింది ?. పడి పడి నవ్వుకునేంత హాస్యం కానీ, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ గానీ సినిమాలో లేవు. మరి, ఈ సినిమా ఎందుకు హిట్ అయ్యింది ? అని అడుగుతున్నారు నెటిజన్లు. అయినా, ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుంది ?, ఎందుకు పోతుంది ఎవరూ చెప్పలేరు. ఈ సినిమా చూసిన జనం మాత్రం ఇది జస్ట్ ఓకే సినిమా అని చెబుతున్నారు. సినిమాలో హింస మితిమీరి పోయింది. కానీ అభ్యంతరకర సన్నివేశాలు ఏమీ లేకపోవడం, ఫ్యామిలీతో సినిమా చూసే విధంగా, సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ కావడమే ఈ భ‌గ‌వంత్ కేస‌రికి బాగా కలిసి వచ్చింది అంటున్నారు.

యాక్టింగ్ పరంగా చూసుకుంటే ‘భ‌గ‌వంత్ కేస‌రి’ క్యారెక్టర్ లో బాలయ్య బాబు తన శక్తి మేర నటించాడని చెప్పుకోవాలి. కాకపోతే కొన్ని చోట్ల ఆయన గెటప్ బాలేదు. మిగతా ఆర్టిస్టులు అందరూ తమ పరిధి మేర నటించారు. అయినా, సినిమా హిట్, ఫట్ తో సినిమా క్వాలిటీకి ఏ మాత్రం సంబంధం ఉండదు. సినిమాలో ఏ ఎమోషన్ కనెక్ట్ అయినా, ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు. భ‌గ‌వంత్ కేస‌రిలో కూడా కూతురు ఎమోషన్ తో పాటు ఆడపిల్లలు ఉన్న ఫ్యామిలీస్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. అందుకే, ఈ దసరాకి ‘భగవంత్ కేసరి’తో పాటు తమిళ స్టార్ హీరో ‘లియో’, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గట్టిగా పోటీ పడ్డాయి.

నిజానికి ఈ మూడు సినిమాల పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. కాకపోతే, లియోలో స్టోరీ నెరేషన్ చాలా ఫ్లాట్‌ గా ఉండటం, కథలో కొత్తదనం లేకపోవడం మైనస్ అయ్యాయి. ఇక టైగర్ నాగేశ్వరరావు మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఫరవాలేదు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా గాడి తప్పింది. క్లైమాక్స్ కూడా సాగదీసినట్టు ఉంది. దాంతో, ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. మొత్తమ్మీద రవితేజ, విజయ్ సినిమాలు తేలిపోయాయి. బాలయ్య ‘భ‌గ‌వంత్ కేస‌రి’ సినిమా మాత్రం రేసులో విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది.

Also Read:Charanraj:’నరకాసుర’ అందరికి నచ్చుతుంది

- Advertisement -