పవన్ డైనమైట్: విజయేంద్రప్రసాద్

50
pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు గుప్పించారు రాజమౌళి తండ్రి,రచయిత విజయేంద్ర ప్రసాద్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన…పవన్ కళ్యాణ్ డైనమైట్ అని పేర్కొన్నారు. పవన్‌కి ప్రత్యేకంగా కథ రాయక్కర్లేదు.. ఆయన నటించిన సినిమాలలో అక్కడక్కడా కొన్ని సీన్స్ తీసుకుంటే కథ తయారవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్‌ని చూడటానికే జనాలు థియేటర్లకు వస్తారని…. అమ్మాయిలతో పాటలు పాడాలి, డాన్సులు చేయాలి, విలన్లను విరగ్గొట్టడం..ప్రజలకు కాస్త మంచి చేయడం..ఇవి ఉంటే చాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ – రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు కథ అందిస్తున్నారు విజయేంద్రప్రసాద్.