2 -డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ

32
2dg

డీఆర్డీవో రూపొందించిన 2-డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేసింది డీసీజీఐ. కోవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద 2డీజీని అనుమతించినట్టు వెల్లడించింది. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని….పాజిటివ్‌గా గుర్తించిన వెంటనే గరిష్టంగా 10 రోజుల పాటు డ్రగ్ ఇవ్వొచ్చని పేర్కొంది.

ఆస్పత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే డ్రగ్ వినియోగించాలని….నియంత్రణ లేని మధుమేహం, తీవ్రమైన హృద్రోగ సమస్యలు, తీవ్ర శ్వాసకోస సమస్యలు, తీవ్ర హెపాటిక్ రీనల్ ఇంపెయిర్మెంట్ సమస్యలున్నవారిపై ఈ డ్రగ్‌ను పరీక్షించలేదన్నారు. కాబట్టి అలాంటివారికి వినియోగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం అన్నారు.

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వరాదని…..రోగులు, వారి బంధువులు ఈ డ్రగ్ కోసం ఆస్పత్రి యాజమాన్యాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను సంప్రదించాల్సిందిగా కోరవచ్చన్నారు. [email protected]కు మెయిల్ చేయడం ద్వారా డ్రగ్ సప్లై కోరవచ్చని పేర్కొంది డీసీజీఐ.