కేటీఆర్ నిజ‌మైన హీరో: సోనూసూద్

53
ktr

మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు న‌టుడు సోనూసూద్. కొంతకాలంగా సేవా కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన సోనూ…..మంత్రి కేటీఆర్‌ రియల్ హీరో అంటూ కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సోనూ… కేటీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంద‌ని పేర్కొన్నారు.

ఆక్సిజన్ కోసం నంద కిశోర్ తోక‌ల అనే ఓ నెటిజ‌న్ కేటీఆర్‌ని సంప్రదించగా వెంటనే స్పందించిన ఆయన వారికి ఆక్సిజన్ సిలిండర్‌ని సమకూర్చారు. దీంతో నందకిశోర్ కేటీఆర్‌ రియల్ హీరో అంటూ పేర్కొనగా దీనిపై స్పందించారు మంత్రి.

త‌న‌కు చేత‌నైనంతా స‌హాయం చేస్తున్నానని..తాను సూప‌ర్ హీరో కాదు…. సూప‌ర్ హీరో అని మీరు సోనూసూద్‌ను పిలవ‌చ్చు అని పేర్కొనగా దీనిపై స్పందించారు సోనూసూద్. కేటీఆర్‌కు థ్యాంక్స్ చెబుతూనే తెలంగాణ ప్ర‌జ‌ల కోసం ఎంతో చేస్తున్న‌ మీరే నిజ‌మైన హీరో. మీ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. దీనిపై స్పందించిన కేటీఆర్….సోనూకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.