ఎర్రవల్లిలో కేంద్రమంత్రి..డబుల్‌పై ప్రశంస

276
Vijay Goel Praises CM KCR
- Advertisement -

సీఎం కేసీఆర్ మానసపుత్రిక డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం దేశంలోని అన్నిరాష్ట్రాలను ఆకర్షిస్తోంది. పేద ప్రజల సొంతింటి కలను నేరవేర్చేందుకు కేసీఆర్‌ చేపట్టిన ఈ పథకం దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంపై ఆసక్తికనబర్చగా..పలువురు కేంద్రమంత్రులు ప్రశంసలు గుప్పించారు. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రతినిధుల ద్వారా సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి,నర్సన్నపేటలో పర్యటించి క్షేత్రస్ధాయిలో అధ్యయనం చేయించాయి.

తాజాగా కేంద్ర క్రీడాశాఖమంత్రి విజయ్ గోయల్‌….బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై ప్రశంసలు గుప్పించారు. ఎర్రవల్లి,నర్సన్నపేటలో పర్యటించిన ఆయన ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను చూసి ఆనందం వ్యక్తం చేశారు. స్ధానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి అయిన ఖర్చును కలెక్టర్‌ని అడిగి తెలుసుకున్నారు.ఎస్సీ కాలనీలోని ఓ ఇంట్లో విజయ్ గోయల్ పెయింటింగ్ వేశారు.

డబుల్ బెడ్ రూం పథకం చాలా గొప్పదని…సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని తెలిపారు. పేద ప్రజల కోసం ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టడం అభినందనీయమని తెలిపారు. సీఎం కేసీఆర్‌ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. అన్ని రంగా్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు.ప్రధాని మోడీ డీమానిటైజేషన్‌కు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.

కేంద్రమంత్రితో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, టూరిజం కమిషనర్ బుర్రా వెంకటేశం, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఉన్నారు.

ప్రగతి భవన్ లో నిన్న సీఎం కేసీఆర్ ను కలిశారు విజయ్ గోయల్. రాష్ట్రంలో రీజనల్ స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.దీనికోస రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని.. స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి విజయ్ గోయల్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

- Advertisement -