బర్త్ డే సందర్భంగా మొక్కలునాటిన వాసుదేవరెడ్డి…

197
vasudevareddy

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోషకుమార్ పిలువు మేరకు రాష్ట్ర తొలి దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ తన నివాసంలో మూడు మొక్కలను నాటడం జరిగింది.

ఈ సందర్భంగా డా.కె.వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని, స్వచ్ఛమైన గాలి,నీడ కోసం, ప్రతి ఒక్కరు చెట్లను నాటాలని, నాటిన చెట్లను బ్రతికించాలని, ఎం.పి సంతోషకుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇంతిఇంతయై వటుడు ఇంతైయై అన్నట్లు ఒక మహా వృక్షంలాగా పెరుగుతుందని,పార్టీలకు అతీతంగా, రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి వారి పిలుపుతో ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అవుతున్నారని, గౌ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణకు హరితహారం ద్వారా ఆకు పచ్చని తెలంగాణ కనపడుతుందని చెట్లు మానవాళికి మనుగడని, చెట్ల ప్రాధాన్యతను ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకున్నదన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగస్వామం యై మొక్కలు నాటాలని వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు.