బాలుకు కరోనా నెగటివ్…స్పందించిన ఎస్పీ చరణ్

429
sp charan

ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా నెగటివ్ వచ్చిందన్న వార్తలపై స్పందించారు ఎస్పీ చరణ్‌. బాలుకు కరోనా నెగటివ్ అని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు చరణ్.

బాలు కు కరోనా నెగిటివ్ రాలేదని . ఆయన ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారని తెలిపారు. నాన్న ఆరోగ్యం పై నాకే సమాచారం వస్తుంది. నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయన ఆరోగ్యం పై వస్తున్న వదంతులు నమ్మకండి అని చరణ్ పేర్కొన్నారు.

ఎక్మో సపోర్ట్ తో నాన్నకు వెంటిలేటర్ పై వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్ధిద్దాం “. అని ఎస్పీ చరణ్ అన్నారు.