మొక్కలు నాటిన సినీ నటుడు కోటేశ్వరరావు..

142
green

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సినీ నటుడు కోటేశ్వరరావు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని సినీ నటుడు కోటేశ్వరరావు అన్నారు.

పచ్చని చెట్లే ప్రగతికి మెట్ల అనే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సినీ నటి సంధ్య జానక్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ సికింద్రాబాద్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటిన నటుడు కోటేశ్వరరావు… అనంతరం మరో ముగ్గురు ( సినీ నటులు నాగినేని రెడ్డి , బెనర్జీ , శ్రీనివాస్ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.