వర్మ..ట్రైలర్ వచ్చేసింది

166
VARMAA Official Trailer

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో సందీప్ వంగా తెర‌కెక్కించిన చిత్రం అర్జున్ రెడ్డి. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. భారీ వసూళ్లతో బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా రీమేక్ మూవీగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక తమిళ్‌లో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ అనే టైటిల్‌తో తెరకెక్కింది. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని బాల తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌తో మ్యాజిక్ చేసిన బాల తాజాగా ట్రైలర్‌తోనూ సినిమాపై అంచనాలను పెంచేశాడు.

ట్రైలర్‌లో మాటలు ఎక్కువగా లేనప్పటికి తెలుగు ట్రైలర్‌ని సేమ్ టూ సేమ్ దించేశాడు. 15 గంట‌ల‌లో చిత్ర ట్రైలర్ మిలియ‌న్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టింది. రొమాన్స్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. అర్జున్ రెడ్డి హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ అవుతుండ‌గా, ఇందులో షాహిద్ క‌పూర్, కియారా అద్వానీలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు.

Varmaa Official Trailer | Dhruv Vikram | Director Bala | Megha | Varma Latest Tamil Movie 2020 | API