హీరో ఆర్యకు కోర్టు నోటీసులు..

253
Hero Aarya

9 ఏళ్ల క్రితం కోలీవుడ్‌ నటుడు ఆర్య నటించిన ‘అవన్ ఇవన్’ సినిమా వివాదాస్పదమైంది. ఈ సినిమా విషయంలో ఆర్యకు కోర్టు నోటీసులు జారీ చేసింది. బాల దర్శకత్వంలో విశాల్.. ఆర్య ఇద్దరు నటించిన ఈ సినిమాలో హిందూ దేవుళ్లు, సోరిముత్తు అయ్యనార్, సింగంపట్టి జామీన్ ను అవమానించేలా సన్నివేశాలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపనలు ఉన్నాయి. అందుకు సంబంధించిన వారు అప్పట్లో కోర్టు ఆశ్రయించగా.. తాజాగా ఈ వ్యవహారం విచారణకు వచ్చింది. దీంతో ఆర్యను ఈ నెల 28న కోర్టుకు హాజరు కావాలంటూ అంబా సముద్రం కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ కేసును కొట్టివేయాలంటూ 2018లో మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్‌ను ఆర్య ఆశ్రయించాడు.