మన్మోహన్ సింగ్ అను నేను..

195
anupam-kher

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. జనవరి 18న సినిమా విడుదల కానుండగా సినిమాపై అనేక వివాదాలు చట్టుముడుతున్నాయి. అయితే ఇవేమీ పట్టించుకోని చిత్రయూనిట్ తాజాగా తెలుగు ట్రైలర్‌ని విడుదల చేసింది.

నాకైతే డాక్టర్ సింగ్ ఎలాంటి లోపం లేని బీష్ముడిలా కనిపిస్తారు అంటూ మొదలయ్యే ట్రైలర్‌లో ఆసాంతం మన్మోహన్‌ను ఓ ఫ్యామిలీ డ్రామాకు బలైపోయిన వ్యక్తిగా చూపించారు. హాభారతంలో రెండు ఫ్యామిలీలు ఉన్నాయి కానీ ఇండియాలో ఒక్కటే అంటూ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.

మన్మోహన్‌ సింగ్‌ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నటించ‌గా.. సోనియా గాంధీగా సజ్జన్‌ బెర్నర్ట్‌ కనిపించనున్నారు. రాహుల్ గాంధీగా అర్జున్ మాథూర్, ప్రియాంక గాంధీగా ఆహానా కుమ్రా నటించారు. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ : ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌’ ఆధారంగా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం తెరకెక్కింది.