వెండితెర అద్భుతం..ఎన్టీఆర్:మహేష్

220
ntr biopic mahesh babu

బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్. నిన్న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఫస్ట్ షో నుండే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. సినీ ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది.

తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు..ఎన్టీఆర్‌ మూవీపై ప్రశంసలు గుప్పించారు. డైరెక్టర్ క్రిష్ తన కుంచెతో వెండితెర కాన్వాస్‌పైఅద్భుతం చేశాడని కొనియాడారు. మహానటుడికి ఇంతకంటే గొప్ప నివాళి మరోటి ఉండదన్నారు.

తెలుగు సినీ పరిశ్రమకు లెజెండ్ అయిన ఎన్టీఆర్‌కు ఈ స్థాయిలో ఘన నివాళి ఇంతవరకు ఎవరూ, ఎప్పుడు ఇవ్వలేదని మహేశ్ పేర్కొన్నారు. మహా నటుడి జీవితం గురించి ప్రపంచానికి తెలియని విషయాలను అందంగా చిత్రీకరించారు. ఆ పాత్రలో బాలకృష్ణ జీవించారు. బ్రిలియంట్ అని ట్వీట్ చేసిన మహేష్‌ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.