కరోనా ఉధృతి.. యూపీఎస్సీ కీలక నిర్ణయం..

165
UPSC
- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలపై పెను ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా అత్యున్నత సర్వీసుల పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. జూన్ 27న నిర్వహించాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వాయిదా వేసింది. కరోనా విసృతంగా వ్యాపిస్తున్న ప్రస్తుత సమయంలో పరీక్షలు జరుపలేమని యూపీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రిలిమ్స్ పరీక్షలను అక్టోబరు 10న జరిపేందుకు రీషెడ్యూల్ చేసినట్టు తెలిపింది.

- Advertisement -