రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న తలైవా..

52
Rajinikanth

కరోనా నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సిన్ వేయించుకోవడమే మార్గమని అని నిపుణులు చెపుతున్న సంగతి తెలిసిందే. దీంతో, సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.తాజాగా ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కరోనా వ్యాక్సిన్ రెండో డోసును తీసుకున్నారు. తన ఇంటిలోనే అయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా రజనీ పక్కన ఆయన కుమార్తె సౌందర్య ఉన్నారు.

దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. తన తాజా చిత్రం ‘అన్నాత్తే’ షూటింగ్ ను ముగించుకుని హైదరాబాద్ నుంచి నిన్ననే ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన ఆయనకు భార్య హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.