- Advertisement -
లాక్ డౌన్ 2.0 గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.ఇప్పటికే 3.0పై విధివిధానాలపై కసరత్తు చేస్తున్న కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
అన్ లాక్ 3.0 దశలో సినిమా హాళ్లు,వ్యాయామశాలలు(జిమ్) తెరిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. సినిమా హాళ్లలో భౌతిక దూరం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, సీటింగ్ సామర్థ్యంలో 25% మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించినట్టు సమాచారం.
విద్యాలయాలు, మెట్రో సర్వీసులు అన్‌లాక్ 3.0లో కూడా ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. బడులు తెరవడంపై పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా వారు అంత సుముఖంగా లేరని సమాచారం.
- Advertisement -