లాక్‌డౌనే పరిష్కార మార్గం: రాహుల్ గాంధీ

29
rahul

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధించాలని అన్నివర్గాల నుండి ఒత్తిడి వస్తుండగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక సూచనలు చేశారు.

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఉన్న ఏకైక మార్గం లాక్‌డౌనేనని స్పష్టం చేశారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరి అనేకమంది అమాయక ప్రజలను చంపేస్తోందని….కేంద్రం, రాష్ట్రాలు తీసుకునే ప్రయాణాలపై ఆంక్షలు, కర్ఫూ వంటి నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుందని పేదలకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని కాంగ్రెస్ అభిప్రాయపడింది.

పరిస్థితి తీవ్రతను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అర్థం చేసుకోవడంలేదని…. కాంగ్రెస్ ప్రతిపాదించిన న్యాయ్​​ పథకాన్ని అమలు చేయడం అవసరమని నొక్కిచెప్పింది.