అన్‌లాక్‌ 4.0…గైడ్‌లైన్స్ ఇవే

160
unlock 4

ఆగస్టు 31తో లాక్ డౌన్ 3.0 గడువు ముగుస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 30 వరకు విద్యాసంస్థలు,స్విమ్మింగ్ పూల్స్‌ బంద్ కొనసాగుతుందని తెలిపిన కేంద్రం సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చింది.

సెప్టెంబర్ 7 నుండి దశలవారీగా మెట్రో సేవలు పున: ప్రారంభించుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్‌ 21 నుంచి సామాజిక / విద్యా / క్రీడలు / వినోదం / సాంస్కృతిక / మత / రాజకీయ తదితర కార్యక్రమాలను 100 మంది మించకుండా నిర్వహించుకోవచ్చని తెలిపింది కేంద్రం.

9 నుంచి 12 తరగతుల విద్యార్థులు తమ పాఠశాలలను(కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల ఉంటేనే) స్వచ్ఛంద ప్రాతిపదికన ఉపాధ్యాయుల నుంచి గైడెన్స్‌ తీసుకోవాడనికి అనుమతి ఉంటుందని తెలిపింది. కంటైన్మెంట్‌ జోన్లలో సెప్టెంబర్‌ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలను తొలగించిన కేంద్రం…..అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగించింది. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలన్న కేంద్రం…అత్యవసరమైతేనే బయటకు రావాలన్న కేంద్రం తెలిపింది. సెప్టెంబర్‌ 30 వరకు కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.