రెండు వారాల లాక్‌డౌన్‌ తప్పనిసరి..!

66
nag

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. సెకండ్ వేవ్‌తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఏప్రిల్ 30 తర్వాత ఎప్పుడైనా తెలంగాణలో లాక్‌ డౌన్‌ విధించనున్నారని ప్రచారం జరుగుతుండగా మహానటి దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రెండు వారాల పాటు అందరూ పర్శనల్ లాక్ డౌన్ పాటిస్తే మంచిది సలహా ఇచ్చారు నాగ్ అశ్విన్. గత కొన్ని వారాలుగా కరోనా నివారణకు వాక్సినేషన్ చేస్తూ, కరోనా రోగులకు వైద్యం చేస్తూ డాక్టర్లు, వారి బృందం ఎంతో అలసిపోయారని, కనీసం వారి కోసమైనా రెండు వారాలు అందరూ వ్యక్తిగతంగా లాక్ డౌన్ పాటిస్తే మేలు అని వెల్లడించారు.

ఒక్కసారి హాస్పిటల్స్ కు వెళ్ళి చూస్తే వైద్య సిబ్బంది ఎంతగా కష్టపడుతున్నారో అర్థమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాగ అశ్విన్ ప్రభాస్ తో ఓ సైటింఫిక్ ఫిక్షన్ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.