అమరావతిలో ఉగాది పురస్కార వేడుక..

297
- Advertisement -

అమరావతి కేంద్రంగా నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో నూతన రాజధానిలో ‘ఉగాది సినిమా పురస్కారాల వేడుక” స్థానిక హ్యాపీ రీసార్ట్లో అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రులు ప్రత్తిపాటి పల్లారావు, పల్లె రఘునాథరెడ్డి, సీనియర్ పార్లమెంట్ సభ్యులు రాయపాటు సాంబశివరావు, నిర్మాతలు తమ్మారెడ్డి భరధ్వాజ, కేవీవీ సత్యనారాయణ, వి.దొరైస్వామిరాజు, సాగర్ మరియు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అతిధులుగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో 2012 ఉగాది నుంచి 2016 ఉగాది వరకు ఓ కేటగిరిగా, 2016 ఉగాది నుంచి 2017 ఉగాదివరకు మరో కేటగిరిగా
ఎంచుకుని ఒక్కో కేటగిరి నుంచి పది చిత్రాల చొప్పున ఉత్తమ చిత్రాలుగా ఎంపికచేసి ఆయా చిత్రాల నిర్మాత, దర్శకులు మరియు నటినటులను ఉగాది సినిమా పురస్కారాలతో సత్కరించారు.

UGADHI CINEMAA PURASKARALU IN AMARAVATI

అలాగే దశాబ్దాలుగా సినీరంగానికి సేవలందిస్తున్న నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనదారులు, స్టూడియో అధినేతలను ఉగాది సినిమా పురస్కారాలతో సత్కరించారు. 40 సంవత్సరాల సినీ జీవితాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న హీరో రాజేంద్రప్రసాద్ ను ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, సినీప్రముఖులు సన్మానించారు. ప్రభుత్వం గుర్తించకపోయినా, ఛాంబర్ గుర్తించి ‘ఓనమాలు చిత్రాన్ని ఉత్తమచిత్రంగా ఎంపికచేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించిదని హీరో రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు సమాంతరంగా అమరావతి, విశాఖలలో అభివృద్ధి చెందాలని అందుకు అవసరమైన సహాయ సహకారాలు, సౌకర్యాలను అందించేదుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాధరెడ్డీಲು హామీ ఇచ్చారు. చలనచిత్ర పరిశ్రమ అమరావతికి తరలివ చ్చేలా కృషిచేయాలని. ఇందుకు తనవంతు సాయం అందిస్తానని పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబ శివరావు వెల్లడించారు.

తమకు అవార్డులు అందించడం పట్ల పెళ్ళిచూపులు” నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకులు తరుణ్ భాస్కర్, హీరోయిన్ రీతూవర్మలు ఆనందాన్ని వ్యక్తంచేశారు. తనకు తొలి అవార్డును అందించిన ఛాంబర్ కు ‘ఘాజీ” చిత్రదర్శకులు సంకల్ప్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. “ఓ మలి చిత్రాన్ని గుర్తించి ఉగాది సినిమా పురస్కారాన్ని అందించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని నటి, దర్శకురాలు రమ్యశ్రీ మరియు నటుడు రఘబాబులు పేర్కొన్నారు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ను గుర్తించడంపట్ల హీరో సప్తగిరి, నిర్మాత డా. కిరణ్‌లు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ‘మిణుగురులు”చిత్రానికిగాను ఛాంబర్ ఆవారులు ఇవ్వడం చాలా సంతృప్తినిచ్చిందని నిర్మాత డా.సుచిత్రాకృష్ణన్, దర్శకులు రాజేష్‌ టచ్‌రివర్‌లు పేర్కొన్నారు. నిర్మాత ఇమ్రాన్, నటుడు ఆశోక్కుమార్‌లు ధర్డమ్యాన్ చిత్రానికిగాను పురస్కారాలు అందుకు న్నారు.

UGADHI CINEMAA PURASKARALU IN AMARAVATI

చాంబర్‌ అధ్యక్షులు భూపాల్ ప్రసాద్ మాట్లాడుతూ నాలుగు సెక్షార్ల సభ్యులను ఉగాది పర్వదినాన సత్కరించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని. ప్రతిఏటా ఈ సంప్రదాయాన్ని కొనసా గించాలని ఉద్దేశ్యంతో ఉన్నామని ఆయన వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి మోహన్‌గౌడ్‌ మాట్లాడుతూ ఒక సదుద్దేశ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి 13 జిల్లాలనుంచి వందల సంఖ్యలో పంపిణీదారులు, ప్రదర్శన దారులు హాజరుకావడం వేల సంఖ్యలో అభిమానులు విచ్చేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. కోశా ధికారి పాలెపు రామారావు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా కృషిచేస్తామని, 13 జిల్లాలకు చెందిన ఈ ఛాంబర్ ద్వారా అనేక కార్యక్రమాలను భవిష్యత్తులో చేపట్టనున్నట్లు తెలిపారు. ఛాంబర్‌కు ప్రభుత్వ ఎఫిలియేషన్ లభించేలా కృషిచేయాలని, ఈ విషయంలో మంత్రులు చొరవచూపాలని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కోరారు. అవార్డులు ఇవ్వడం ఏమాత్రం తప్పకాదని అలాగే ఇక్కడ ఛాంబర్ ಅಭಿవృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

అంగరంగ వైభవంగా ఉగాది సినిమా పురస్కారాలను అందిస్తున్న ఈ ఛాంబర్ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టాలని దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ పేర్కొన్నారు. హ్యాపీ రిసార్ట్స్‌లో ఇంత మంచి వేడుక జరగడంపట్ల పురస్కారాల కమిటీ ఛైర్మన్ అంబటి మధుమోహన్ కృష్ణ ఆనందాన్ని వ్యక్తంచేశారు. రీసార్ట్స్లో సినిమా షూటింగ్కు కావాల్సిన అన్నీ సౌకర్యాలు ఉన్నాయని ఛాంబర్ద్వారా వచ్చిన నిర్మాతలకు ప్రత్యేక ప్రోత్సాహా కాలను అందిస్తామని అంబటి మధుమోహన్ కృష్ణ పేర్కొన్నారు. పురస్కారాల కమిటీ కోఆర్డినేటర్, నిర్మాత విజయవర్మ పాకలపాటి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. మురళీ బోడపాటి, రావిపల్లి రాంబాబు, అనీల్ నారిశెట్టి, రవి, ఈశ్వర్, శివ, చైతన్య, పర్వతనేని రవి, హరి, నాగరాజు, మంచెం ఇర్ఫానా, ఏఎన్ఆర్ ఫ్యాన్స్ సూరి తదితరులు వివిధ కమిటీలలో సేవలందించారు.

- Advertisement -