ఏపీ మంత్రులు.. చేతనైతే పోరాడండి !

33
- Advertisement -

ఏపీలో ప్రధానంగా రెండు సమస్యలు ఎప్పుడు వేదిస్తుంటాయి. ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు అంశం, మరోటి ప్రత్యేక హోదా. ప్రభుత్వ రంగ ఆస్తి అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పై అన్నీ వైపులా నుంచి వ్యతిరేకత ఏర్పడినప్పటికి కేంద్రం మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పుకొచ్చింది. అయితే ప్రైవేటీకరణ రద్దుపై గట్టిగా పోరాడడంలో జగన్ సర్కార్ విఫలం అయిందనే విమర్శ మొదటి నుంచి కూడా వినిపిస్తోంది. పార్లమెంట్ సభల్లోనూ, లేదా మీడియా సమావేశాల్లోనూ ఏదో నామమాత్రంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పడం తప్పా పెద్దగా పోరాడిన దాఖలాలు లేవనేది అందరికీ తెలిసిందే.

కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ విశాఖ ప్రైవేటీకరణ రద్దు ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని అవసరమైతే బిడ్డింగ్ లో కూడా పాల్గొంటామని చెప్పడంతో ఇన్నాళ్ళు వెనక్కి తగ్గని కేంద్రం.. కే‌సి‌ఆర్ చొరవతో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రైవేటీకరణ రద్దును వాయిదా వేయించడంలో క్రెడిట్ తెలంగాణ ముఖమంత్రి కే‌సి‌ఆర్ కు దక్కిందానే భావనతో ఏపీ మంత్రులకు మింగుడు పడడం లేదు. దాంతో తెలంగాణలోని కే‌సి‌ఆర్ పాలనపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దానికి తెలంగాణ మంత్రులు కూడా ధీటుగానే కౌంటర్లు వేస్తున్నారు. తెలంగాణ లో జరిగిన అభివృద్దితో పోల్చితే.. ఏపీ అభివృద్ది ఏంటని ప్రశ్నిస్తున్నారు.

దాంతో ఏపీ మంత్రులు తెల్లమొఖం వేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రుల వ్యవహార శైలి పై మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలోనూ, స్టీల్ ప్లాంట్ రద్దు అంశంలోనూ ఏపీ మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చేతనైతే వాటికోసం పోరాడండి అని హితవు పలికారు హరీష్ రావు. దీంతో హరీష్ రావు మాటలకు ఏపీ ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది. ప్రత్యేక హోదా విషయంలోనూ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రం వద్ద చేతులు కట్టుకొని ఉండడం తప్పా.. ఏనాడైనా పోరాటాన్ని కనబరిచరా ? అంటూ ఏపీ మంత్రులపై ప్రజలు మండి పడుతున్నారు.

ఇవి కూడా చదవండి…

Pawan:తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

Karnataka Elections:బీజేపీకి షాక్.. కోలుకోవడం కష్టమే !

జనసేనలో అంతర్మథనం.. అందుకే ఆ నిర్ణయం!

- Advertisement -