హైదరి విడాకులు తీసుకుందట..

157

అదితి రావు హైదరి దశాబ్ద కాలంగా హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తుంది. ఈ అమ్మడు హైద్రాబాదీనే అయినా ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో చేయలేదు. కానీ బాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత కాట్రు వెలియిదాయ్ అనే మూవీతో మళ్లీ తమిళ్ లో అడుగు పెడుతుండగా.. ఇదే చిత్రాన్ని చెలియా అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది.

Aditi Rao Hydari divorced

అయితే అసలు విషయానికొస్తే.. ఈ బ్యూటీకి ఇప్పటికే పెళ్లి కూడా అయిందాట.కాని పెళ్లయిపోయిందనే విషయం తక్కువ మందికే తెలుసు. అడిగినా కూడా ఆ ఒక్కటీ తప్ప అన్నట్లుగా తప్పించుకోవడం ఈ భామకు అలవాటు. పెళ్లి మాత్రమే కాదు.. ఇప్పటికే అదితి విడాకులు కూడా తీసేసుకుంది. 2009లో సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అదితి. ఇతను గతంలో ఇన్ కం ట్యాక్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేసి.. ఇప్పుడు తను కూడా యాక్టింగ్ ఫీల్డ్ లోకే ఎంటర్ అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో ఈ ఇద్దరు 2013లో విడాకులు తీసేసుకున్నారు.

విడాకుల తర్వాత ఇద్దరి కెరీర్ ఊపందుకోవడం విశేషం. సినిమాల్లో అదితి తెగ బిజీ అయిపోగా.. ప్రస్తుతం మణిరత్నం సినిమాతో అద్భుతమైన ఆఫర్ వచ్చింది. సంజయ్ దత్ మూవీ భూమిలోను.. సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావతిలో కూడా నటించేస్తుండడంతో.. వీటి రిలీజ్ తర్వాత స్టార్ గా మారిపోవడం ఖాయం అంటున్నాయి సిని వర్గాలు