రాష్ట్రంలో టీడీపీ నిలబడే పరిస్ధితి లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రగతి భవన్‌లో టీటీడీపీ అధ్యక్షుడు రమణతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం మాట్లాడిన ఎర్రబెల్లి…రమణ అంటే కేసీఆర్ కు అభిమానం అన్నారు. చేనేత కుటుంభం నుంచి వచ్చిన రమణ టిఆర్ఎస్ కు అవసరం అన్నారు. చేనేత వర్గాలకు చాలా చేశాం….ఇంకా చేయాల్సి ఉందన్నారు. రమణను టిఆర్ఎస్ రావాలని కేసీఆర్ ఆహ్వానించారు…రమణ సానుకూలంగా స్పందించారన్నారు.
రెండు మూడ్రోజుల్లో రమణ టీఆర్‌ఎస్‌లో చేరతారని, తెలంగాణ టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తారని వెల్లడించారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లెటర్ ఇవ్వటంలో తనతోపాటు రమణ కృషి ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆహ్వానించగానే రమణ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్తు లేదని, ఇంకా అక్కడక్కడ ఉన్న ఆ పార్టీ శ్రేణులు టీఆర్‌ఎస్‌లో విలీనం అవుతాయని వెల్లడించారు.