సీఎం కేసీఆర్ వెంట నడుస్తా: ఎల్ రమణ..

142
ramana

సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు టీటీడీపీ ఎల్ రమణ. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి సీఎంను కలిసిన రమణ….తమ భేటీలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయని వెల్లడించారు.సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలన్న ఆలోచనను కేసీఆర్ చెప్పారు… తనతో పాటు కలసి రావాలని కేసీఆర్ కోరారని వెల్లడించారు. టిఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు… సానుకూలంగా నిర్ణయం ఉంటుందని కేసీఆర్ కు చెప్పానని తెలిపారు రమణ.

జగిత్యాలకు వైద్య కళాశాల ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపానని… తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్థానం, గత ఏడేండ్లలో స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు వివరించారు. దేశంలో వివిధ రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ర్టాల్లో జరిగిన పరిణామాలు.. తెలంగాణలో జరుగుతున్న ప్రగతిపై సీఎం కేసీఆర్‌ విడమరచి చెప్పారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన పాలనా సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయని ప్రశంసించారు. కొవిడ్‌ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందని కితాబిచ్చారు.