కరోనా…కాక్‌ టెయిల్ తీసుకున్న ట్రంప్‌..!

264
trump
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంప్‌ సహా ఆయన భార్య మెలానియా ట్రంప్‌ కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రంప్ చికిత్స పొందుతుండగా కరోనా వ్యాక్సిన్ కోసం ఆ దేశంలో ప్రయోగాలు వేగవంతంగా జరగుతున్నాయి.

ఇప్పటికే మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ జరుగుతుండగా ప్రయోగాత్మకంగా తయారు చేసిన యాంటీబాడీ కాక్ టెయిల్‌ను తీసుకున్నారు ట్రంప్‌. ఈ కాక్ టైల్ పేరు ‘ఆర్ఈజీఎన్ – సీఓవీ2’. పలు రకాల ఔషధాలతో కలిపి తయారు చేసిన ప్రయోగాత్మక ఔషధం. దీనిని రెజెనేరన్ ఫార్మాస్యుటికల్స్ ఐఎన్సీ అభివృద్ధి చేసింది.దీనిలో రెండు రకాల మోనోలోకల్ యాంటీ బాడీస్ ఉంటాయి. ఆర్ఈజీఎన్ 10933, ఆర్ఈజీఎన్ 10987 పేర్లతో ఉన్న యాంటీ బాడీలు ప్రత్యేకంగా సార్స్ కోవ్-2ను అడ్డుకుని, వాటిని నిర్వీర్యం చేస్తాయి.

తొలి దశలో 275 మంది, రెండు, మూడవ దశల్లో 1,300 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ మూడు దశల్లోనూ వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఫలితాలు రాలేదు.

- Advertisement -