హత్రాస్ ఘటన…సీబీఐ విచారణ!

97
yogi adithyanath

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ కేసులో బీజేపీ సర్కార్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ కాషాయ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు.

అన్ని వర్గాల నుండి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించాలని యోగి సర్కార్ నిర్ణయించింది. బాధితురాలి కుటుంబాన్ని అధికారులు పరామర్శించిన అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అత్యాచారానికి గురై మరణించిన బాధితురాలి డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించకుండా అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఈ కేసు దేశంలో సంచలనంగా మారింది.