బ్రేకింగ్..ట్రంప్‌కు బిగ్ షాక్

32
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు షాకిచ్చింది.2024 నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించింది. 2020లో అధ్యక్ష ఎన్నికల తరువాత ఆ దేశ పార్లమెంట్‌ భవనంపై భయానక దాడికి ట్రంప్‌ కారణమని తేల్చింది.

అయితే ఆయనకు ఊరట కలిగించే అంశం ఏంటంటే ఈ నిర్ణయం ఒక్క కొలరాడో స్టేట్‌కు మాత్రమే పరిమితం అవుతుంది. మిగిలిన రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు. దీంతో ఆయన పేరు ఒక్క కొలరాడో రాష్ట్రంలో కనిపంచదు.

ఏడుమంది న్యాయమూర్తులు గల ధర్మాసనంలో ముగ్గురు న్యాయమూర్తులు ఈ తీర్పును వ్యతిరేకించగా నలుగురు ట్రంప్ నిషేధానికి మొగ్గు చూపారు. మెజారిటీ సభ్యులు ట్రంప్ అనర్హతకు అనుకూలంగా ఉండటంతో తీర్పు వెలువడింది.

ఈసారి అమెరికా ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామి పోటీలో ఉన్నారు. ప్రీపోల్ సర్వేల్లో డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధిస్తూ వస్తోన్నారు.

Also Read:సెలవుపై జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత!

- Advertisement -