ముగిసిన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం..

38
gutha

ఎమ్మెల్యేల కోటాలో అసెంబ్లీకి ఎన్నికైన ఆరుగురు సభ్యులు, గవర్నర్ కోటాలో ఒక సభ్యుని పదవీకాలం నేటితో ముగియనుంది. పదవీకాలం ముగిసే వారి జాబితాలో గుత్తా సుఖేందర్ రెడ్డి,నేతి విద్యాసాగర్,బోడకుంటి వెంకటేశ్వర్లు,కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత,గవర్నర్ కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడు స్ధానాల ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడగా త్వరలోనే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. అయితే ఖాళీ అవుతున్న ఈ స్ధానాల కోసం ఆశావాహులు భారీగా ఎదురుచూస్తున్నారు.ఇందులో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రెడ్డి ఉండటంతో వీరు తిరిగి తమ అభ్యర్థిత్వాన్ని ఆశీస్తున్నారు.

వీరితో పాటు నాగార్జునసాగర్ టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ కోటిరెడ్డి,మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్,చాడ కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, సిరికొండ మధుసూదనాచారి,గుడిమల్ల రవికుమార్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.