రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం

36
temple

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎండవేడిమితో ఉక్కపోతకు గురవుతున్న ప్రజలకు వర్షం కాస్త రిలీఫ్ ఇవ్వగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. యాదాద్రిలో ఉదయం కురిసిన వర్షానికి బాలాలయంలోకి వర్షం నీరు చేరింది. భారీగా నీరు చేరడంతో బాలాలయం చెరువును తలపిస్తోంది. వర్షపు నీటిలోనే కుర్చీలు వేసుకుని అర్చకులు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.

మాదాపూర్‌లో 5 సెంటిమీటర్లు, గచ్చిబౌలింలో 4.6 సెంటిమీటర్లు, చందానగర్‌లో 4.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయిం‍ది. సిద్దిపేట జిల్లా బెజగన్‌లో 12.2 సెంటి మీటర్లు, దుబ్బాక మండలంలోని పోతిరెడ్డిపేటలో 11.2 సెంటి మీటర్లు, కొండపాక, తిప్పారంలో 10.5 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది.