పసిడి ధర మళ్లీ తగ్గింది..

462
today-gold-prices
- Advertisement -

పసిడి ధర మళ్లీ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.38,550కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,550, విజయవాడలో రూ.38,500, విశాఖపట్నంలో రూ.39,540, ప్రొద్దుటూరులో రూ.38,600, చెన్నైలో రూ.38,220గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,730, విజయవాడలో రూ.35,700, విశాఖపట్నంలో రూ.36,370, ప్రొద్దుటూరులో రూ.35,730, చెన్నైలో రూ.36,570గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,400, విజయవాడలో రూ.47,000, విశాఖపట్నంలో రూ.47,200, ప్రొద్దుటూరులో రూ.46,800, చెన్నైలో రూ.49,400 వద్ద ముగిసింది.

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

- Advertisement -