టీ న్యూస్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ప్రారంభం..

227
tnews
- Advertisement -

టీ-న్యూస్‌, అపెక్స్‌ ఎడ్యుకేషన్ సర్వీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ 2020 ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌ అమీర్‌ పేట్‌ లోని కమ్మ సంఘం భవనంలో నిర్వహిస్తున్న ఈ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యారంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. స్వరాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కాలేజీలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని అందుకే ఇతర రాష్ట్రాల విద్యార్ధులు ఇక్కడ చదువుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమ గొంతుకాగా నిలిచిన టీన్యూస్‌ ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్‌ కు బంగారు బాటలు వేస్తోందని ప్రశంసించారు.

ఈ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ తో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు.. సంపూర్ణమైన అవగాహన వస్తుందని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీన్యూస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ సురేశ్‌ బాబు, సీజీఎం ఉపేందర్‌ పాల్గొన్నారు. నేటి నుండి మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల ఈ ఫెయిర్ జరగనుంది.

- Advertisement -