ఓటేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి…

103
speaker pocharam

నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా శాస‌నస‌భ‌ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి త‌న‌ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న 42వ‌ పోలింగ్ కేంద్రంలో స్పీక‌ర్ ఓటు వేశారు.

మొత్తం 824 మంది స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 12న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా రెండు రౌండ్లలో కౌటింగ్ పూర్తి కానుంది.